
బాధ విన్నారు.. భరోసా ఇచ్చారు
యాదగిరిగుట్ట రూరల్: మండలంలోని పెద్దకందుకూరులో బుధవారం కలెక్టర్ హనుమంతరావు ఇందిరమ్మ ఇళ్ల పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగుడు కొమ్మగాని రవి తల్లి లక్ష్మి తమ కుటుంబం పేదరికంతో ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. తన కుమారుడు పుట్టుకతో దివ్యాంగుడని, ఇంట్లో ఇద్దరమే ఉంటామని, చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపింది. పూటగడవడం కష్టంగా ఉందని, ఆదుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది. వెంటనే స్పందించిన కలెక్టర్.. బ్యాంకు అధికారికి ఫోన్‌చేసి రవికి లోన్ ఇవ్వాలని ఆదేశించారు. బ్యాటరీతో నడిచే ట్రై వాహనాన్ని కూడా ఇప్పిస్తానని కలెక్టర్ రవికి హామీ ఇచ్చారు.