
రాజ్యాంగ హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
శాలిగౌరారం: దొంగ ఓట్లను సృష్టించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ దోపిడీకి పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘రైజ్ యువర్ వాయిస్’ అనే నినాదంతో ‘ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీకి మద్దతుగా దేశం బాగు కోసం మా సంతకం’ అనే కార్యక్రమాన్ని బుధవారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులను హరిస్తూ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ఓట్లచోరీతో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు బిహార్‌లోనూ అదేవిధంగా కార్యాచరణ చేపట్టిందన్నారు. ఓట్లచోరీకి వ్యతిరేకంగా జరిగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తనకు ఓటుహక్కు కలిగి ఉన్న సొంత గ్రామంలోని అదే బూత్ పరిధిలో సంతకాల సేకరణ ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ తాళ్లూరి మురళి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ చామల మహేందర్‌రెడ్డి, పీసీసీ మాజీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్, గంట్ల వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఎర్ర చైతన్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గణేశ్ పాల్గొన్నారు.
ఫఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి