
అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు అబ్దుల్ కలాం స్ఫూర్తితో చదవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు అన్నారు. నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, గోల్డ్‌మెడల్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉన్నతమైన కళ, జ్ఞాన సముపార్జన, నిరంతరం శ్రమ, పట్టుదల ఈ నాలుగు నియమాలు అనుసరిస్తే ప్రతి విద్యార్థి అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాజధానిలోని కళాశాలలతో పోటీ పడుతుండడం అభినందనీయమన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కళాశాలలో దాతల సహకారంతో మూడు గోల్డ్ మోడల్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్లగొండ ఎన్జీ కళాశాల, రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు ఎస్.ఉపేందర్, రహత్ ఖానం, ప్రోగాం కన్వీనర్ శ్రీనివాసాచారి, వైస్ ప్రిన్సిపాల్ నాగు, అధ్యాపకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్, హరిత, మధుసూదన్‌రెడ్డి, శంకర్, రవీందర్, నర్సింహాచారి, శివశంకర్ పాల్గొన్నారు.
ఫ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ రాములు