నిరీక్షణ ఫలిస్తున్న వేళ.. | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణ ఫలిస్తున్న వేళ..

Jul 23 2025 5:37 AM | Updated on Jul 23 2025 5:37 AM

నిరీక

నిరీక్షణ ఫలిస్తున్న వేళ..

సాక్షి, యాదాద్రి: కొత్త రేషన్‌కార్డుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణ ఫలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు క్షేత్రస్థాయిలో రేషన్‌ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. దీంతో మండలాల్లో రేషన్‌కార్డుల పంపిణీకి జిల్లా అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది.

ఇచ్చిన హామీ మేరకు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా జిల్లావ్యాప్తంగా అర్హులైన వారికి 16,460 కొత్త కార్డులను మంజూరు చేసింది. వీటితోపాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్‌ కార్డుల్లో 37,795 మంది కొత్త సభ్యులను చేర్చారు. సీఎం ఆదేశాలతో మరోమారు ఎమ్మెల్యేల సమక్షంలో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే కార్డుల పంపిణీ ప్రారంభం

ఈనెల 14 సీఎం రేవంత్‌రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలలగిరిలో రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఈనెల 18న యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఈనెల 21న భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రేషన్‌ కార్డుల పంపిణీని ప్రారంభించారు. అలాగే మంగళవారం చౌటుప్పల్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రామన్నపేటలో, వేముల వీరేశం ప్రారంభించారు.

మండలాల వారీగా..

సీఎం ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఎమ్మెల్యేలు, అధికారులు మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు నూతన రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు మండలాల వారీగా షెడ్యూల్‌ను తయారు చేస్తున్నారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరైన లబ్ధిదారుల జాబితాల ప్రకారం ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లు మండల స్థాయికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా వలిగొండ మండలంలో 1,723, అత్యల్పంగా అడ్డగూడూరు మండలంలో 238 రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి.

రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ

అర్హులకు ప్రభుత్వం రేషన్‌ కార్డులు నిరంతరం మంజూరు చేస్తోంది. ఇప్పటికే మీసేవా, ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా పరిశీలించి అర్హులకు కార్డులు మంజూరు చేశారు. ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చాం. అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలి.

– జి.వీరారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌

పదేళ్ల తర్వాత పేదలకు అందుతున్న రేషన్‌ కార్డులు

అన్ని నియోజకవర్గాల్లో

పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యేలు

25 నుంచి మండలాల వారీగా అందజేత

జిల్లా వ్యాప్తంగా 16,460

కొత్త రేషన్‌ కార్డులు మంజూరు

నిరీక్షణ ఫలిస్తున్న వేళ..1
1/1

నిరీక్షణ ఫలిస్తున్న వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement