
పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం
సాక్షి,యాదాద్రి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రులు.. జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరై మాట్లాడారు. పలు విషయాలను మంత్రులకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్, డీఎంహెచ్‌ఓ మనోహర్, ఇతర అధికారులు హాజరయ్యారు.
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
అడ్డగూడూరు : పరిసరాల పరిశుభ్రతతోని సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర పరిశీలన అధికారి జుబేదా అన్నారు. మంగళవారం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం అడ్డగూడూరు మండల కేంద్రంలోని పీహెచ్‌సీని సందర్శించింది. ఆరోగ్య పథకాల గురించి తెలుసుకున్నారు. గ్రామంలో శానిటేషన్, కంపోస్టు నిర్వహణను పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వీరి వెంట ఎంపీడీఓ శంకరయ్య, ఎంపీఓ ప్రేమలత, కార్యదర్శ నరేష్ ఉన్నారు.
జాతీయ బృందం..
పంటల పరిశీలన
మోత్కూరు : పంటల విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు మంగళవారం జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ), వ్యవసాయ, ప్రణాళిక శాఖల ఆధ్వర్యంలో మోత్కూరు మండలం పాటిమట్లలో వివిధ పంటలను పరిశీలించారు. 20 సర్వే నంబర్లలో పంటల విస్తీర్ణాన్ని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.డి.ప్రమోద్ సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ ఇన్‌చార్జి అధికారి నీలిమ నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రణాళికా శాఖ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ పి.శ్రీనివాస్, ఏఓ కీర్తి, మండల ప్రణాళికా గణాంక అధికారి జి.కృష్ణ, ఏఈఓ ముప్పిడి అశోక్‌కుమార్, రైతులు దొండ సత్తయ్య, బండ రాంరెడ్డి, బండ నర్సిరెడ్డి పాల్గొన్నారు.

పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం

పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం