
గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన మహిళ కాలు
రామన్నపేట: రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ కాలు ఆస్పత్రి గేటు ముందున్న క్యాటిల్ గార్డ్(గ్రిల్స్)లో ఇరుక్కుపోయింది. వివరాలు.. రామన్నపేటకు చెందిన యాదమ్మ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో తన బంధువులకు శనివారం భోజనం తీసుకొని వెళ్తుండగా.. ఆమె కాలు ఆస్పత్రి గేటు ముందు ఉన్న గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. ఆస్పత్రి సిబ్బంది గమనించి గ్రిల్స్ పైపును కట్ చేసి యాదమ్మ కాలును బయటకు తీశారు.
కుక్క కాటుకు గురై వ్యక్తి మృతి
మేళ్లచెరువు: కుక్క కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వివరాలు.. మేళ్లచెరువు మండలం కందిబండ గ్రామానికి చెందిన డెక్కం మధు(39) ఇంటి ఎదుట 20 రోజుల క్రితం చిన్న కుక్కపిల్లను వేరే కుక్కలు కరుస్తుండగా.. అతడు కుక్కపిల్లను కాపాడబోయే క్రమంలో కుక్కపిల్ల అతడి చేతిని కొరికింది. అతడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మూడు వారాల తర్వాత అతడికి రేబిస్ వ్యాధి తీవ్రత ఎక్కువకావడంతో కుటుంబ సభ్యులు నాలుగురోజుల క్రితం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
నేరాల నియంత్రణకే కార్డన్‌సెర్చ్
కోదాడరూరల్: నేరాలను నియంత్రించేందుకే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి కోదాడ పట్టణ పరిధిలోని సాలార్జంగ్‌పేట్‌లో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇళ్లు, షాపులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు చూపించని 34 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శివశంకర్, ఎస్‌ఐలు సుఽధీర్‌కుమార్, హనుమానాయక్, 30మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలే కీలకం
సూర్యాపేట : గ్రామస్థాయిలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతీ ఓటును గెలవాలంటే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలు, అభివృద్ధిని వివరించాలని ఎమ్మెల్సీ సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వారి మద్దతు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా ప్రభారి గోలి మధుసూదన్ రెడ్డి, హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, జిల్లా కన్వీనర్ కడియం రామచంద్రయ్య, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన మహిళ కాలు

గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన మహిళ కాలు