
ముగిసిన రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు గురువారంతో ముగిశాయి. మూడో రోజు హైదరాబాద్ విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ వారు స్వేచ్ఛ అనే నాటిక, మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వారు సంధ్య వెలుగు అనే నాటికను ప్రదర్శించారు. ఈ నాటికలను భారత ప్రభుత్వ కల్చరల్ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యుడు మారంరాజు రామచందర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తమచారి, పెరుమాళ్ల ఆనంద్, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్. కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.