
భువనగిరిలో ఫుడ్ ఫెస్టివల్
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న వంద రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మెప్మా సిబ్బంది, వీధి వ్యాపారులు తినుబండరాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఫెడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. వంటకాలను పరిశీలించి రుచి చూశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈ కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
ఆలేరు: హోం ప్లాంటేషన్‌లో భాగంగా గురువా రం ఆలేరు మున్సిపాలిటీలో ఇంటింటికీ మొ క్కల పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా మార్చాలనే ఉద్దేశంతో హోంప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఐదు మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి లోని 12వార్డుల్లో 5వేలకుపైగా ఇళ్లు ఉన్నాయని, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నట్టు మున్సిపల్ మేనేజర్ జగన్‌మోహన్ తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, కీర్తి, వార్డు అధికారులు,ఆర్పీలు పాల్గొన్నారు.
అడ్మిషన్‌లు పెంచాలి
రామన్నపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని, పూర్వ విద్యార్థులు కూడా తోడ్పాటునందించాలని ఇంటర్‌బోర్డు ప్రత్యేక అధికారి భీమ్‌సింగ్ కోరారు.గురువారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. వార్షిక పరీక్షల్లో రామన్నపేట కళా శాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా టాపర్లుగా నిలవడం అభినందనీయం అన్నారు. బస్సు సౌకర్యం లేదని విద్యార్థులు అధికారి దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
మోస్తరు వర్షం
భువనగిరిటౌన్, మోత్కూరు: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వానాకాలం ఆరంభం నుంచి సరైన వర్షం కురువకపోవడంతో పత్తి విత్తనాలు వాడిపోవడం, మొక్కల ఎదుగుదల నిలిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతులకు ఊరట చెందారు. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. వర్షానికి మోత్కూరులో రహదారులు జలమయం అయ్యాయి.
వర్షపాతం ఇలా (మి.మీ)
సంస్థాన్‌నారాయణపురంలో 65, వలిగొండ 51, మోత్కూరు 50, భువనగిరి 35, బీబీనగర్ 34, బొమ్మలరామారం 29, ఆత్మకూర్(ఎం) 19, అడ్డగూడూరులో 18 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

భువనగిరిలో ఫుడ్ ఫెస్టివల్