
సాధారణ కాన్పులు, ఓపీ పెంచితే అవార్డులు
భువనగిరి : ఆగస్టు 15 వరకు సాధారణ కాన్పులు, ఓపీ పెరిగిన ఆస్పత్రులకు అవార్డులు ఇవ్వనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య, ఓపీ ఎక్కువగా ఉంటుందో అక్కడి సిబ్బంది మెరుగైన సేవలందించినట్లు భావిస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు పూర్తి సమయం అందుబాటులో ఉండాలని సూచించారు.బిడ్డ బిడ్డకు మధ్య వ్యవధి ఎక్కువగా పాటించిన దంపతులు, ఓకే బిడ్డతో కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించిన దంపతులకు ప్రో త్సాహక బహుమతులు అదజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద, శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు