
నేలకొండపల్లి సమీపంలో బుద్ధిష్ట్ థీమ్ పార్కు ఏర్పాటు
నాగార్జునసాగర్: ఖమ్మం జిల్లా పరిధిలోని నేలకొండపల్లి బౌద్ధ స్థూపానికి సమీపంలో సుమారు 8 ఎకరాల్లో బుద్ధిష్ట్ థీమ్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఖమ్మం జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర ప్రజా సంబంధాల, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణమైన బుద్ధవనంలోని అన్ని విభాగాలు, జాతక పార్కు, బుద్ధచరితవనం, ధ్యాన వనం, స్థూపపార్కు, మహాస్థూపంపై చెక్కిన శిల్పాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ అధికారి శాసన ఉన్నారు.