
కొనసాగుతున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండో రోజు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నాటకాలను ప్రారంభించారు. హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారు అమ్మ చెక్కిన బొమ్మ అనే నాటిక, హైదరాబాద్ మిత్రా క్రియేషన్స్ వారు ఇది రహదారి కాదు అనే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్, ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జి. వెంకట్‌రెడ్డి, సెక్రటరీ జెల్లా శ్రీశైలం, కోమలి కళాసమితి అధ్యక్షుడు బక్క పిచ్చయ్య, సెక్రటరీ ఎంఎల్. నర్సింహారావు, రఘుపతి, జీఎల్ కుమార్, వి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు