
చదువుల తల్లిని ఆదుకోరూ..
మిర్యాలగూడ: ఉన్నత చదువులు చదివేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థిని దాతల కోసం ఎదురు చూస్తోది. వివరాలు.. దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన పానుగోతు సైదానాయక్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. సైదానాయక్ పాలిష్ మిల్లులో వర్కర్‌గా పనిచేస్తుండగా.. సునీత వ్యవసాయ కూలీ పనులు చేస్తూ నలుగురు పిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పిల్లల చదువు కోసం వారికి ఉన్న రెండున్నర ఎకరాలతో పాటు ఇంటి స్థలం సైతం అమ్ముకున్నారు. పెద్ద కూతురు మానసకు రెండేళ్ల క్రితం పంజాబ్ రాష్ట్రంలో ఐఐటీ–రోపర్‌లో సీటు రాగా.. ఆ అమ్మాయికి దాతలు ఆపన్నహస్తం అందించడంతో ఉన్నత విద్యను కొనసాగిస్తోంది. రెండో కుమార్తె ధనలక్ష్మి ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఎస్టీ కేటగిరిలో 3757వ ర్యాంకు సాధించి పుదుచ్చేరి యూనివర్సిటీలో సీటు సాధించింది. అయితే అక్కడకు వెళ్లి చదువుకునేందుకు రూ.3లక్షల వరకు ఖర్చు వస్తుండడంతో తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆమెను అక్కడకు పంపించలేదని తండ్రి సైదా పేర్కొన్నాడు. తమ కుమార్తె కాలేజీకి వెళ్లకుండా ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటుందని.. దాతలు ఆదుకుంటే తన రెండో కుమార్తె చదువు కొనసాగించే అవకాశం ఉందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఫ పుదుచ్చేరి యూనివర్సిటీలో
సీటు సాధించిన ధనలక్ష్మి
ఫ రూ.3లక్షలు ఖర్చువుతుండడంతో డబ్బుల్లేక పంపించని తల్లిదండ్రులు
ఫ దాతల సాయం కోసం
ఎదురుచూపు