
అటవీ వ్యవసాయం విస్తరించాలి
బొమ్మలరామారం: సుస్థిర ఆదాయం పొందడానికి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అటవీ వ్యవసాయం విస్తరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత డాక్టర్ రామాంజనేయులు అన్నారు. బొమ్మలరామారం మండలం యావపూర్ గ్రామంలో బుధవారం అటవీ వ్యవసాయ పద్ధతులపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ వ్యవసాయంలో రైతులు లాభాలు పొందడానికి శ్రీగంధం, మామిడి, మలబారు వేప, కుంకుడు, నీలగిరి, మహాగని, అల్లనేరేడు, వెదురు, సీతాఫలం తదితర మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అటవీ వ్యవసాయంలో మొక్కలను పెంచడంతో పాటు వాటి మధ్య గల ఖాళీ స్థలంలో పంటలు వేసుకోవడం, పశువులను పెంచడంతో సుస్థిర ఆదాయం పొందవచ్చన్నారు. అనంతరం షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక ఆర్థిక సహాయంలో భాగంగా సీతాఫలం, వెదురు, మహాగని మొక్కలు, స్పేయర్లు, కొమ్మలను కత్తిరించే సెకేచర్లను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రమేష్, విజయలక్ష్మి, శ్రీలత, అనిల్‌కుమార్, యాదగిరిగుట్ట వ్యవసాయ సహాయ సంచాలకులు శాంతి నిర్మల, ఎంపీడీఓ రాజా త్రివిక్రమ్, ఏఓ దుర్గేశ్వరి, రైతులు పాల్గొన్నారు.
ఫ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ
వ్యవసాయ విశ్వవిద్యాలయం
ప్రధాన శాస్త్రవేత రామాంజనేయులు