
అధిక వడీ్డ ఆశ చూపి మోసం
మిర్యాలగూడ అర్బన్: అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి అమాయక ప్రజల నుంచి భారీ మెత్తంలో డబ్బులు వసూలు చేసి ఉడాయించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర రాజు విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన బండి సంధ్య 20శాతం, 30శాతం వడ్డీ ఇస్తామని ఆశ చూపి పట్టణంలోని తొమ్మిది మంది నుంచి రూ.32లక్షలు వసూలు చేసింది. అదేవిధంగా మిర్యాలగూడలోని సుందర్‌నగర్ కాలనీకి చెందిన అవిరెండ్ల అఖిల్‌తో కలిసి ఫ్రెండ్స్ లక్కీ డ్రా స్కీం ఏర్పాటు చేసి ప్రతినెల రూ.1000 15నెలలు కట్టించుకుని ప్రతి నెలా డ్రా తీసి కొంతమందికి రూ.15వేల విలువైన వస్తువులు ఇస్తామని డబ్బులు కట్టించుకున్నారు. డబ్బులు ఇచ్చిన వారు తమ డబ్బులు తమకు ఇవ్వాలని అడగగా.. సంధ్య, అఖిల్ తప్పించుకు తిరుగుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంధ్య, అఖిల్‌పై కేసు నమోదు చేసి ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో వన్ టౌన్ సీఐ మోతీరామ్, టూటౌన్ సీఐ సోమనర్సయ్య, ఎస్‌ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు తదితరులున్నారు.
ఫ రూ.32 లక్షలతో ఉడాయించిన
నిందితుల అరెస్ట్