
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రాజాపేట : అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రాజాపేట మండలంలోని నెమిల మదిర గ్రామం పిట్టగూడెం, సోమారం, బొందుగుల, పారుపల్లి, బూర్గుపల్లి, కుర్రారం తదితర గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పారుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు, మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మండలంలోని గొలుసుకట్టు చెరువుల ద్వారా గోదావరి జిలాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేయగా సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి, ఎంపీఓ కిషన్, ప్రత్యేక అధికారులు, హౌజింగ్ ఏఈ కోటయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిలివేరు బాలరాజు గౌడ్, మాడోతు విఠల్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
20న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక
బీబీనగర్: బీబీనగర్ పరిధిలోని మహదేవ్‌పురం గ్రామంలో గల బ్రహ్మకుమారీస్ సైలెన్స్ రిట్రీట్ సెంటర్‌లో ఈనెల 20న నిర్వహించనున్న సెమినార్‌కు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నట్లు బ్రహ్మకుమారీస్ సెంటర్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి, సామరస్యాన్ని పెంపొందించడం, ప్రజా సంబంధాలు అంశంపై సెమినార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నాణ్యమైన విద్య
అందించడమే ధ్యేయం
మోత్కూరు : జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఇంటర్మీడియట్ బోర్డు జాయింట్ సెక్రెటరీ ఎల్.భీమ్‌సింగ్ అన్నారు. బుధవారం ఆయన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని జోగు దీక్షితను సన్మానించారు. కళాశాల కర దీపిక, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ముద్రించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.ప్రభాజస్టిస్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె.నర్సింహారెడ్డి, లెక్చరర్లు సీహెచ్.లింగస్వామి, ఎం.పరశురాములు, వై.నర్సిరెడ్డి, ఎ.హరికృష్ణ, విజయలక్ష్మి, సుజాత, మల్లిఖార్జున్, అంజయ్య, లావణ్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు