
ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం
సాక్షి,యాదాద్రి : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారకులైన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రి కోమటిరెడ్డి బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి స్థానిక డీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ కార్యాలయం గుడి లాంటిదని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాన్నారు. వచ్చేనెల జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, జనగాం ఉపేంందర్‌రెడ్డి, బర్రె జహంగీర్ తదితరులు ఉన్నారు.
నూతన భవన నిర్మాణాలకు
రూ.8.50 కోట్లు
భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్ నూతన భవన నిర్మాణాలకు రూ.8.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భువనగిరికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి విన్నపం మేరకు విడుదల చేస్తునట్లు ప్రకటించారు. అనంతరం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల ప్రక్రియపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. జిల్లాలో మొత్తం 9,374 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 6,836 ఇళ్లకు మార్క్ ఔట్ చేశామని, మిగతావి వివిధ దశలో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. అలాగే జిల్లాలో 11,960 రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, భువనగిరి ఆర్‌డీఓ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటాం