
రిజర్వేషన్లపై ఉత్కంఠ!
ఎన్నికలకు సిద్ధంగా యంత్రాంగం
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. పోలింగ్‌కు అవసరమైన 1,800 పెద్ద, చిన్న బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధంగా ఉంచింది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ కోసం 6,708 మంది సిబ్బంది అవసరమని గుర్తించి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్నికల సంఘం రూపొందించిన గుర్తులతో బ్యాలెట్ పత్రాలను ముద్రించారు. ఓటరు జాబితా ముద్రించి ఆరునెలలు అవుతున్నందున మరోసారి జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా అనుబంధ ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
సాక్షి, యాదాద్రి : ఇన్నాళ్లూ తమకు సీటు వస్తుందో లేదోనని తర్జనభర్జన పడిన నేతలు ఇప్పుడు రిజర్వేషన్లపై చర్చించుకుంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంచుకున్న వార్డు, స్థానంలో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు ఎవరికి రిజర్వ్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపైనే అంతటా చర్చ కొనసాగుతోంది.
కేటాయింపు ఇలా..
జిల్లాలో 427 గ్రామ పంచాయతీలకు 3,704 వార్డులు ఉన్నాయి. 17 జెడ్పీటీసీ స్థానాలు, 17 ఎంపీపీలు, 178 ఎంపీటీసీ స్థానాలు, ఆరు మున్సిపాలిటీలు, 104 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం అయితే అన్ని ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. సర్పంచ్‌ల కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను 180 వరకు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ వార్డుల్లో 1,600 వరకు బీసీలకు కేటాయించే అవకాశం ఉంది.
మండలం యూనిట్‌గా..
ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు మండలం యూనిట్‌గా ఎంపిక చేయనున్నారు. అలాగే జిల్లా యూనిట్‌గా ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు, జిల్లా యూనిట్‌గా జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
మహిళలకు 50 శాతం రిజర్వుడు
గతంలో మాదిరిగానే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్‌లు అన్ని స్థానాల్లో మహిళలకు ఆయా సామాజిక వర్గాల వారీగా యాబై శాతం రిజర్వేషన్ కేటాయిస్తారు.
చట్టం సవరింపు తప్పదా
2018లో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల చట్టం ప్రకారం పది సంవత్సరాలు పాటు రిజర్వేషన్లు కొనసాగాలి. ఐదేళ్ల కాలానికి రిజర్వు అయిన కేటగిరీ రెండోసారి ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే తాజాగా మారనున్న రిజర్వేషన్లతో పంచాయతీ రాజ్ , మున్సిపల్ చట్టాలను మార్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం సైతం పాత చట్టాలను మార్చక తప్పని పరిస్థితి నెలకొంది.
ఆశావహుల్లో గుబులు
మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా రిజర్వేషన్ల చర్చ జరుగుతోంది. పాత రిజర్వేషన్లు ఉంటాయని భావించి పోటీచేయాలని సిద్ధమవుతున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది.
ముందస్తు ప్రణాళిల్లో ప్రధాన పార్టీలు
మారనున్న రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వెలువడనున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీలు అంతర్గత సమావేశాలకు తెరలేపాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు ఎలా కై వసం చేసుకోవాలో ఆయా పార్టీల ముఖ్య నాయకులు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఫ స్థానిక సంస్థల్లో బీసీలకు
42 శాతం అమలుకు ప్రభుత్వం సిద్ధం
ఫ మండలం యూనిట్‌గా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల కేటాయింపు
ఫ మారనున్న రిజర్వుడు స్థానాలు
ఫ ఏ స్థానం ఎవరికి రిజర్వు
అవుతుందోనని చర్చ
బీసీలకు రిజర్వు కానున్న స్థానాలు (అంచనా)
కేటగిరీ స్థానాలు
సర్పంచ్‌లు 180
వార్డులు 1,600
ఎంపీటీసీలు 67
ఎంపీపీలు 06
జెడ్పీటీసీలు 06