
విధి నిర్వహణలో అలసత్వం వద్దు : సీపీ
బీబీనగర్: పోలీస్ విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వంగా ఉండొద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం ఆయన బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును, కేసుల నమోదు వివరాలను పరిశీలించారు. అనంతరం ఫిర్యాదుదారులకు అందించాల్సిన సత్వర సేవలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, విధుల నిర్వహణ తదితర అంశాల ప్రాముఖ్యతలపై పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏసీపీ రాహుల్‌రెడ్డి, సీఐ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.