
బీజేపీతోనే తెలంగాణలో స్వర్ణయుగం
చౌటుప్పల్ : బీజేపీతోనే తెలంగాణలో స్వర్ణయుగం వస్తుందని, అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు విజయసంకల్పంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా సోమవారం నల్లగొండకు వెళ్తున్న ఆయన చౌటుప్పల్‌లో ఆగారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు తిలకందిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు చరమగీతం పాడేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే సాధ్యమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. తమ పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సివెల్ల మహేందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రమనగోని శంకర్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, మండల, మున్సిపల్ అధ్యక్షులు కై రంకొండ అశోక్, కడారి కల్పనయాదవ్, నాయకులు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, పోలోజు శ్రీధర్‌బాబు, కంచర్ల గోవర్ధన్‌రెడ్డి, రమనగోని దీపిక, ముత్యాల భూపాల్‌రెడ్డి, రిక్కల సుధాకర్‌రెడ్డి, కాయితి రమేష్‌గౌడ్, మునగాల తిరుపతిరెడ్డి, బత్తుల జంగయ్య, ఉబ్బు భిక్షపతి, ఊడుగు వెంకటేశం, గోశిక నీరజ, దిండు భాస్కర్, పబ్బు వంశీ, బుడ్డ సురేష్, ఉష్కాగుల నాగరాజు, కడారి అయిలయ్య, కడవేరు పాండు పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు