
ప్రజావాణిలో 70 వినతులు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో వినతులు భారీగా వచ్చాయి. మొత్తం 70 అర్జీలు రాగా.. అత్యధికంగా 57 అర్జీలు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు వినతిపత్రాలు స్వీకరించారు.
● భువనగిరిలో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చే యాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు మహ్మద్ షరీఫ్, లయిఖ్‌అహ్మద్ కోరారు.
● కొరటికల్‌లోని నల్లచెరువు అలుగు, కాలువ ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామానికి చెందిన నరహరిగౌడ్ విన్నవించారు.
● భువనగిరిలోని 11వ వార్డు పరిధిలో సర్వే నం. 118లో 68 మందికి ప్లాట్లు కేటాయించి పొజిషన్ చూపలేదని లబ్ధిదారులు అర్జీ అందజేశారు.
ఫ అత్యధికంగా భూ సమస్యలపైనే..