
● ఆలిగా.. అమ్మగా..
మర్రిగూడ: కష్టసుఖా ల్లో తోడుగా ఉంటానని పెళ్లిలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటోంది మర్రి గూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన భిక్షమమ్మ. ఆదివారం సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన వైద్య శిబిరానికి ఆమె తన భర్త రత్నయ్యను తీసుకొని వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త రత్నయ్యకు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి తినిపించింది. వీరికి ముగ్గురు ఆడపిల్లల సంతానం కాగా.. అందరికీ వివాహాలు చేశారు. వీరు గతంలో మిరపకాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవారు.