
నిషేధిత అల్ఫ్రాజోలం మత్తు పదార్థం పట్టివేత
భూదాన్‌పోచంపల్లి: కల్లులో కలిపే నిషేధిత అల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని ఓ వ్యక్తి అక్రమంగా స్కూటీలో రవాణా చేస్తుండగా శుక్రవారం సాయంత్రం భూదాన్‌పోచంపల్లి మండలం పిలాయిపల్లి శివారులో ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. భువనగిరి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ పి. నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పిలాయిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని రంగయ్య నిషేధిత అల్ఫ్రాజోలంను స్కూటీలో తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు గ్రామ శివారులో ఎకై ్సజ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని 250 గ్రాముల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. రంగ శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి అల్ఫ్రాజోలం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో సిద్దగోని రంగయ్యతో పాటు రంగ శ్రీనివాస్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. రంగయ్యను శనివారం కోర్టులో రిమాండ్ చేశామని, రంగ శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
చెరువులో జారిపడి
యువకుడి మృతి
కోదాడరూరల్: బహిర్భూమికి చెరువు వద్దకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో గురువారం రాత్రి జరిగగా.. శనివారం వెలుగులోకి వచ్చింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాపుగల్లు గ్రామానికి చెందిన కరుణాకర్(33) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గురువారం రాత్రి గ్రామ పరిధిలోని చెరువు కట్ట వద్దకు బహిర్భూమికి వెళ్లగా.. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతిచెందాడు. అర్ధరాత్రి అయినా కరుణాకర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం ఓ వ్యక్తి చెరువు వైపు వెళ్లగా చెరువులో మృతదేహం తేలియాడుతుండటం గమనించి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయగా.. అది కరుణాకర్ మృతదేహంగా గుర్తించారు. మృతుడి తండ్రి నర్సింహరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ పోలీసులు తెలిపారు.