
బీసీలకు రిజర్వేషన్ల ఘనత కాంగ్రెస్‌దే
భువనగిరిటౌన్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ సంపత్‌కుమార్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు.శుక్రవారం భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించడంలో అన్ని పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను కై వసం చేసుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఫ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్