
బీసీ, ఎస్టీలకు కేబినెట్‌లో చోటు కల్పించాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఇటీవల కేబినెట్ విస్తరణలో భాగంగా బీసీ, మాల, మాదిగలకు మంత్రులుగా చోటు కల్పించడం సంతోషకరమని, ఖాళీగా ఉన్న మరో మూడింటిని కూడా బీసీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నట్లు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం పూర్తి అధికారం సీఎం రేవంత్‌రెడ్డికి ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే చిన్న వర్గాల వారికి పదవులు ఇవ్వాలన్నారు. తన జన్మదినోత్సవం సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు బీర్ల శంకర్, బందారపు భిక్షపతి, ఎరుకల హేమేందర్‌గౌడ్, శ్రీరాంమూర్తి, దడిగె ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు