డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి

Jul 12 2025 6:53 AM | Updated on Jul 12 2025 6:53 AM

డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి

డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలి

క్యాంపస్‌ సమాచారం

నల్లగొండ టూటౌన్‌: డిగ్రీ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరగాలని నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆడిట్‌సెల్‌ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు, సిలబస్‌, వంటి అంశాలపై చర్చించారు. 20శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సులను వేరే విద్యాలయాలకు బదిలీ చేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రతి డిగ్రీ కళాశాల ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు 75 శాతం హాజరును తప్పనిసరి చేస్తూ బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో రిజిస్ట్రార్‌ అల్వాల రవి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్‌ జయంతి, ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

ఎంఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు ఆహ్వానం

నల్లగొండ టూటౌన్‌: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సీపీజీఈటీ– 2025 ద్వారా ఎంఎస్సీ జియాలజీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. బీఎస్సీ జియాలజీ, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యా థ్స్‌, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కోర్సులో చేరడానికి సీపీజీఈటీ 2025 ద్వారా ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జియాలజీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌

2011లో ఎంజీ యూనివర్సిటీలో జియాలజీ విభాగం 20 సీట్లతో ప్రారంభం కాగా.. ప్రస్తుతం 40 సీట్లు ఉన్నాయి. ఆధునిక ల్యాబ్స్‌, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్‌ తరగతులు, ప్రతి సెమిస్టర్‌లో ఫీల్డ్‌ ట్రైనింగ్‌, జాతీయ స్థాయి సంస్థలతో ఎంఓల అనుసంధానం, ప్లేస్‌మెంట్‌ సౌకర్యాలు ఉన్నాయి. ప్రాక్టికల్‌ నిర్వహణతో విద్యార్థుల్లో అనుభవ సామర్థ్యం పెంచడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని జీఎస్‌ఐ, ఎన్‌ఆర్‌ఎస్‌, ఓఎన్‌జీసీ, ఐబీఎం, ఎన్‌ఎండీసీ, ఐఎస్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఎస్‌ఈ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ తదితర రంగాల్లో అవకాశాలు లభిస్తాయని యూనివర్సిటీ అధ్యాపక బృందం పేర్కొంటుంది. జియాలజీ కోర్సు పూర్తి చేసి సంబంధిత ఉద్యోగం పొందిన వారికి వార్షిక వేతనం రూ.3.5 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు, ప్రభుత్వం రంగంలో నెలకు రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఎంజీయూలోని ఎంఎస్సీ జియాలజీ పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు దక్కాయి.

ఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement