
యాదగిరిగుట్ట సర్కిళ్లలో విగ్రహాల ఏర్పాటుపై సమీక్ష
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ దిగువన రింగ్‌లో రోడ్డులోని సర్కిళ్లలో దేవుళ్ల విగ్రహాల ఏర్పాటుపై ఈఓ వెంకట్రావ్ ఆలయ అధికారులు, స్తపతులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న నాలుగు సర్కిళ్లను పరిశీలించి, ఏ సర్కిల్‌లో ఏ విగ్రహం ఏర్పాటు చేయాలని చర్చించారు. ఇటీవల నాలుగు సర్కిళ్లలో యాదరుషి, శ్రీ అభయఆంజనేయస్వామి, ప్రహ్లాద, గరుడ దేవుళ్ల పేర్లతో నామకరణం చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం సర్కిళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈఓ వెంకట్రావ్ వెల్లడిచారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు దయాకర్‌రెడ్డి, రఘు, స్తపతులు పాల్గొన్నారు.