
విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు
మిరప
మిరప పంటను జూలై 15వ తేదీ వరకు నారు పోసుకుని నాటుకోవచ్చు. నేరుగా సాలు పద్ధతిలోనూ మిరప విత్తనాలను నాటవచ్చు. మిర పంటకాలం 180 రోజులకు కోతకు వస్తుంది. మార్కెట్‌లో లభించే అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రీడ్ రకాలను ఎంపిక చేసుకోవాలి.
పెద్దవూర: పంటల సాగులో విత్తనాలు విత్తే సమయం అత్యంత కీలకం. వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఈ సీజన్‌లో ఏఏ పంటలు సాగు చేసుకుంటే మంచిది, ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి అనే విషయాలపై పెద్దవూర మండల వ్యవసాయ అధికారి పి. సందీప్‌కుమార్ సలహాలు, సూచనలు..
పత్తి
ఆశించిన వర్షాలు కురిస్తే జూలై 15వ తేదీ వరకు పత్తి విత్తనాలను వేసుకోవచ్చు. ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. పెసర, కంది అంతర పంటలుగా వేసుకుంటే మంచిది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సుమారు 20 సంస్థలకు చెందిన బీటీ–2 పత్తి విత్తనాన్ని మాత్రమే విత్తుకోవాలి. ఎకరానికి సాగు భూమిని బట్టి 8 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. జనవరిలో రెండో పంటగా మొక్కజొన్న, పెసర, కూరగాయలు పంటలను సాగు చేసుకుంటే మంచిది. పంట కాలాన్ని మార్చి వరకు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించవద్దు.
కంది
కంది, మినుము, పెసర పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవాలి. కందిని పత్తి, మొక్కజొన్న పంటల్లో కూడా అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ప్రధానంగా కందిలో రుద్రేశ్వర రకం పంటకాలం 160 నుంచి 180 రోజులు కాగా.. ఎకరానికి 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. డబ్ల్యూఆర్‌జీ 97 కంది రకం పంటకాలం 150–160 రోజులు కాగా ఎకరానికి 6–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
వరి
వరి సాగు చేసే రైతులు దీర్ఘకాలిక రకాలను ఇప్పటికే నార్లు పోసుకోవాలి. మధ్యకాలిక రకాలు జూలై 10వ తేదీ వరకు నార్లు పోసేందుకు సమయం ఉంది. జూలై 31 వరకు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకునేందుకు అనుకూలం. ఆగస్టు 15 వరకు అన్నిరకాల వరి నాట్లు పూర్తి చేయాలి. సాగుకు ముందు పొలంలో పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము, పెసర విత్తనాలను సాగు చేసి పూతదశలో పొలంలో కలియదున్నితే భూసారం పెరిగి పంటకు మేలు జరుగుతుంది. ఎరువుల ఖర్చు తగ్గుతుంది. నార్లు పోసే సమయంలో తప్పకుండా వరి విత్తనాన్ని శుద్ధి చేయాలి.
ఫ దీర్ఘకాలిక సన్నరకాలు: సిద్ధి రకం పంటకాలం 140 రోజులు కాగా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు వస్తుంది. వరంగల్ సాంబ పంటకాలం 140 రోజులు కాగా ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి, వరంగల్ సన్నాలు పంటకాలం 135 రోజులు కాగా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు, తెలంగాణ సోన రకం పంట కాలం 125–130 రోజులు కాగా ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాంబ మసూరి పంటకాలం 150 రోజులు కాగా ఎకరానికి 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జైశ్రీరాం రకం పంటకాలం 135–140 రోజులు కాగా ఎకరాకు 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
ఫ దొడ్డు రకం: కూనారం సన్నాలు, బతుకమ్మ, కాటన్‌దొర రకాల పంటకాలం 120 రోజులు కాగా.. ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జగిత్యాల రైస్–1 రకం పంట కాలం 125 రోజులు కాగా ఎకరానికి 32 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
మొక్కజొన్న
మొక్కజొన్న పంటను జూలై 15 వరకు సాగు చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే హైబ్రీడ్ రకాలు సాగు చేసుకోవచ్చు. భూమికి అనుకూలమైనవి ఎంపిక చేసుకోవాలి. మొక్కజొన్నను ఏక పంటగా కాకుండా కందితో కలిపి అంతర పంటగా వేసుకుంటే మంచిది.
ఫ పెద్దవూర మండల వ్యవసాయాధికారి
సందీప్‌కుమార్ సూచనలు

విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు

విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు

విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు

విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు

విత్తనాలు సకాలంలో విత్తుకోవడమే మేలు