
స్థానిక ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్‌కు కృషి
సూర్యాపేట: యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 25శాతం రిజర్వేషన్ కల్పించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి శివచరణ్‌రెడ్డితో పాటు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో యూత్ కాంగ్రెస్ పాత్ర మరువలేనిదని అన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వానికి యువత త్వరలో చరమగీతం పాడి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం ఖాయమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై గత పది సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్ నిర్వహించిన పోరాటాల స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా యువజన కాంగ్రెస్ పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన సమయంలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందన్నారు. ఐవైసీ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జవహార్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, గుర్ర శ్యాంచరణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యరెడ్డి, అంబేద్కర్, నవీన్‌చారి, పట్టణ అధ్యక్షుడు అంజత్ అలీ, మాజీ కౌన్సిలర్లు బైరు శైలేందర్, బాలుగౌడ్, రవి, రెబల్ శ్రీను, చేడే అంబేద్కర్, విజయభాస్కర్, ఏజాజ్, కుమార్, జావిద్, కోరుకొప్పుల నరేష్, అజీం, కుక్కడపు మహేష్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు సాయి తదితరులు పాల్గొన్నారు.
ఫ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి