
తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం
మోత్కూరు: తమ వ్యవసాయ భూమిలోని బోరు సమీపంలోనే పక్క భూమి వ్యక్తి బోరు వేశాడని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన తండ్రి, కొడుకు గురువారం మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్‌రెడ్డి తన ఏడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. పంటల సాగు కోసం తన భూమిలో బోరు వేసినప్పటికీ.. తన పక్కన భూమి ఉన్న వ్యక్తి వాల్టా చట్టానికి విరుద్ధంగా 40 మీటర్ల దూరంలో మరో బోరు వేయించడంతో శేఖర్‌రెడ్డి బోరు ఎండిపోయింది. ఈ విషయమై ఏప్రిల్ 24న తహసీల్దార్ కార్యాలయంలో శేఖర్‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఆర్‌ఐ శ్రీనివాసులు బోరును పరిశీలించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు హనీష్‌రెడ్డి మోత్కూరు తహసీల్దార్ కార్యాలయం వద్దకు పురుగుల మందు, పెట్రోల్ బాటిల్‌తో వచ్చి ఆత్మహత్యాయత్నం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై తహసీల్దార్ జ్యోతి స్పందిస్తూ.. శేఖర్‌రెడ్డి భూమి పక్కనే వేసిన బోరును శుక్రవారం సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫ తమ భూమి పక్కనే బోరు వేశారని మనస్తాపం

తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం