హామీల అమలెప్పుడు సారూ..
గుట్ట పాలకమండలి సమీక్షలతోనే సరి.. మూసీ పునరుజ్జీవానికి పడని అడుగులు
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
సీఎం రేవంత్‌రెడ్డి తిర్మలాపూర్ సభాస్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. 2.40కి హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి తిర్మలాపూర్ చేరుకుంటారు. 3.10కి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే బహిరంగసభలో పేదలకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్ అందజేస్తారు. 5 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాల్గోసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్ట క్షేత్రానికి, ఆ తరువాత మూసీ ప్రక్షాళన పాదయాత్ర కోసం, యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణగోపురం ప్రారంభోత్సవానికి వచ్చారు. గత సంవత్సరం నవంబర్‌లో జిల్లాకు వచ్చిన సందర్భంగా యాదగిరిగుట్ట అభివృద్ధి పాలకమండలి, మూసీ పునరుజ్జీవం అంశాలను ప్రకటించారు. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదు. శుక్రవారం జిల్లాకు వస్తున్న సీఎం.. గంధమల్ల రిజర్వాయర్, మెడికల్ కళాశాల, వేద పాఠశాల, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రోడ్లు, వంతెనల పనులకు శంకుస్థాపనకు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, ఇంకా ఏమైనా వరాల జల్లు కురిపించేనా.. అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పెండింగ్‌లో గుట్ట పాలకమండలి
తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే ప్రతిపాదించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకమండలి లేకపోవడంతో భక్తుల సౌకర్యాలకు సంబంధించి పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గతంలో ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు సుమారు రూ.100 కోట్లు మంజూరుకు నో చుకోలేదు. దీంతో పనులన్నీ అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొండపైన భక్తుల వసతులకు సంబంధించిన పలు రకాల పనులను ప్రాంరభించాల్సి ఉంది. ప్రధానంగా కల్యాణ మండపం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు.
గోశాల దత్తతను మరిచారు
యాదగిరిగుట్ట దేవస్థానంలో గోసంరక్షణ పాలసీ ఇంకా రూపొందించలేదు. దేవస్థానం గోశాలను మోడల్ గోశాలగా అభివృద్ధి చేయాలని, భక్తులు గోవులను, గోశాలను దత్తత తీసుకునే విధంగా ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయాలన్న సూచన కార్యరూపం దాల్చలేదు.
కొత్త రెవెన్యూ డివిజన్లు ఏమామే..
ఆలేరు, మోత్కూరు రెవెన్యూ డివిజన్లు చేయాలని అక్కడి ప్రజలు కొన్నేళ్లుగా కోరుతున్నారు. అలేరు రఘునాథపురం, వేములకొండ మండలాల కోసం పోరాటాలు జరిగాయి. వేములకొండ మండలం ప్రకటించినా అమలు కాలేదు.
బహిరంగ సభకు భారీ జనసమీకరణ
తిర్మలాపూర్ వద్ద జరిగే బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేయనున్నారు. సుమారు 50 వేల మంది సభకు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. సభ జరిగే ప్రాంతానికి సమీపంలో ఉన్న తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల నుంచి అధికంగా జనసమీకరణపై దృష్టి సారించారు. మహిళలను ఆర్టీసీ బస్సుల్లో, పురుషులను డీసీఎంలలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మహిళా సంఘాల సభ్యులను సభకు తరలించే బాధ్యతను అధికారులకు అప్పగించారు.
నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక
ఫ తిర్మలాపూర్ బహిరంగ సభలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఫ హామీలపై ఆశలు పెట్టుకున్న ప్రజలు
నెరవేరని పునరుజ్జీవ హామీ
ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు ఇచ్చిన మూసీ పునరుజ్జీవం హామీ నెరవేరలేదు. నవంబర్ 8న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వలిగొండ మండలం సంగెంవద్ద స్వయంగా పాదయాత్ర చేసి ప్రకటించారు. రూ.2కోట్లతో సంగెంవద్ద గల బీమలింగం శివయ్యను దర్శించుకునే ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పిన మాట అమలు కాలేదు. అలాగే జనవరి 25న మూసీ వెంట వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించినా ప్రారంభం కాలేదు.
హామీల అమలెప్పుడు సారూ..
హామీల అమలెప్పుడు సారూ..


