
సాయినాథుడి ఆలయం ముస్తాబు
చింతపల్లి: చింతపల్లిలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం వార్షికోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం ఉదయం మంగళ వాయిద్య సుంఘోషణ, గణపతి ప్రార్థన, గోపూజ నిర్వహించి ఉత్సవాలకు అంకురారోహణ చేయనున్నారు. బుధవారం గావ్యాంత పూజ, వాస్తు పూజ, వాస్తు హోమం జరిపించనున్నారు. గురువారం ఉత్సవాలను ముక్కామల పీఠాధిపతి శ్రీధర స్వామి, చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ, శైవాగమ ప్రతిష్టాచార్య శానకొండ శివ కిరణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
● నేటి నుంచి మూడు రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు