కన్నెకంటికి లీడర్ అవార్డుతో సన్మానం
రామన్నపేట: రామన్నపేట మండలం మునిపంపుల మాజీ ఎంపీటీసీ సభ్యుడు, సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరాచారిని హైదరాబాద్‌లోని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ వారు లీడర్ అవార్డుతో సన్మానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో గల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను సన్మానించారు. రాజకీయాల్లో విశ్వకర్మల భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా 14 రాష్ట్రాలకు చెందిన 410మంది విశ్వకర్మ ప్రతినిధులను సన్మానించినట్లు వెంకటేశ్వరాచారి తెలిపారు.


