
బీబీనగర్ ఎయిమ్స్‌లో సాంకేతిక సమస్యలు
బీబీనగర్: బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాలకు వైద్య కోసం వచ్చిన రోగులు గురువారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓపీ రిజిస్ట్రేషన్ విభాగంలోని కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పేషెంట్లు గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వేచి ఉండక తప్పలేదు, స్థానికులు క్యూలైన్‌లో నిలిబడలేక తిరిగి వెళ్లిపోయారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకొని రోగులకు సకాలంలో ఓపీ రిజిస్ట్రేషన్ జరిగేలా ఎయిమ్స్ అధికారులు చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పనిచేయని కంప్యూటర్లు
ఓపీ రిజిస్ట్రేషన్ వద్ద రోగుల ఇబ్బందులు