51కిలోల గంజాయి పట్టివేత
భువనగిరిటౌన్: ఏపీలోని చిత్తూరు నుంచి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు తరలిస్తున్న రూ.14.50 లక్షల విలువైన 51.13 కిలోల గంజాయిని బుధవారం భువనగిరిలో పట్టుకున్నట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు. ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం... ఎస్‌ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ శివారులోని వైల్ట్ స్టోన్ వెంచర్ వద్ద జగదేవ్‌పూర్ రోడ్డులో బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి తనిఖీ చేయగా 51.13 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న సంగారెడ్డి జిల్లా ఈశన్నపురం గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్, సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన డ్రైవర్ మొహమ్మద్ ఇస్మాయిల్, అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ ఇస్మాయిల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుర్చినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మరో నిందితుడు హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన బాషా పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


