‘చలో వరంగల్’ను విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట రూరల్ : వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా రాసిన చలో వరంగల్ వాల్ రైటింగ్‌ను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో స్వయంగా చలో వరంగల్, జై కేసీఆర్ నినాదాలతో వాల్ రైటింగ రాశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభలో కేసీఆర్ చెప్పే మాటల కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆమె వెంట ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నాయకులు రేపాక స్వామి, కానుగు బొట్టు రాజు, సీస శేఖర్, యడపల్లి మహేష్, కానుగు అనిల్ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత


