తాటికల్ వాసికి డాక్టరేట్
నకిరేకల్: నకిరేకల్ మండలం తాటికల్‌కు చెందిన చనగాని భిక్షం–జయమ్మ దంపతుల కుమారుడు చనగాని రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. దివ్యాంగుడైన రామకృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. అంజయ్య పర్యవేక్షణలో ‘ఆన్ ఇన్విస్టిగేషన్ ఇన్ టూ ది లైఫ్ అండ్ స్ట్రగుల్స్ ఆఫ్ ధర్మభిక్షంగౌడ్ (1922–2011)’అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. దీంతో రామకృష్ణకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.
రామన్నపేట యువకుడికి..
రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన నకిరేకంటి నాగరాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందాడు. హిందీ దళిత్ కహానియో మే చత్రిత్ దళిత్ జీవన్ కా యతార్ద్(1980–2010)కే సందర్భ్ మే అను అంశంపై ప్రొఫెసర్ మాయాదేవి వాగ్మరే పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం సమర్పించారు.. పీహెచ్‌డీ పట్టాను సాధించిన నాగరాజును పలువురు అభినందించారు.
గాజులమల్కాపురం వాసికి..
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ మండలం గాజులమల్కాపురం గ్రామానికి చెందిన వట్టికూటి సందీప్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో దళిత బహుజనుల పాత్ర అనే అంశంపై చరిత్ర విభాగం ఆచార్యుడు అడపా సత్యనారాయణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గానూ ఆయనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా సందీప్‌ను స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.
తాటికల్ వాసికి డాక్టరేట్
తాటికల్ వాసికి డాక్టరేట్


