ఉపాధిహామీ కూలీల చెంతకు బడిబాట
ఆత్మకూరు(ఎం) : బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం పోతిరెడ్డిపల్లికి వెళ్లారు. చాలామంది ఉపాధిహామీ పనులకు వెళ్లడంతో.. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు.. ఉపాధిహామీ పనులు నిర్వహించే ప్రదేశానికి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయని, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని.. ఈ అవకాశాలను సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఒత్తిడి లేని విద్య ఉంటుందని, మీ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వెంకన్న, ఉపాధ్యాయులు రవి, వరప్రసాద్, శ్రీనువాసాచారి, అనురాధ, వెంకటేశం పాల్గొన్నారు.


