సైబర్‌ నేరాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలను అరికట్టాలి

Apr 20 2024 1:35 AM | Updated on Apr 20 2024 1:35 AM

మాట్లాడుతున్న హంట్‌ మెట్రిక్‌ సంస్థ 
డైరెక్టర్‌ కృష్ణ  - Sakshi

మాట్లాడుతున్న హంట్‌ మెట్రిక్‌ సంస్థ డైరెక్టర్‌ కృష్ణ

నల్లగొండ రూరల్‌: సైబర్‌ నేరాలను అరికట్టే శక్తి సామర్థ్యాలు యువత పెంపొందించుకోవాలని హైదరాబాద్‌కు చెందిన హంట్‌ మెట్రిక్స్‌ సంస్థ డైరెక్టర్‌ కృష్ణ అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హంట్‌ మెట్రిక్స్‌, ఎంజీయూ సంయుక్తంగా సైబర్‌ నేరాలు–సవాళ్లు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 10.5 ట్రిలియన్‌ డాలర్లను ప్రజలు సైబర్‌ నేరాల కారణంగా నష్టపోతున్నట్లు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే ఏటా రూ.600 కోట్లు నేరగాళ్ల వల్ల నష్టపోతున్నారని అన్నారు. సోషల్‌ మీడియాలో ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరచడం వల్ల నేరగాళ్ల వలలో పడుతున్నట్లు తెలిపారు. ఉచితాలు, తక్కువ ధరల ముసుగులో నేరగాళ్లు పంపే లింక్‌ మెసేజ్‌లు ఓపెన్‌ చేసి అమాయకులు నష్టపోతున్నారన్నారు. అన్ని రంగాల్లో సైబర్‌ నేరాలకు అవకాశం ఉందని, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే మానవ వనరులు పెంచుకోవాలన్నారు. సైబర్‌ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఇతరులను చైతన్యం చేయాలన్నారు. సైబర్‌ నేరాలు అరికట్టడంలో నైపుణ్యం ఉంటే భవిష్యత్‌లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవగాహ న ఒప్పందాలు చేసుకుని స్వల్ప కాలిక కోర్సులను హంట్‌ మెట్రిక్‌ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలి పారు. కృత్రిమ మేధాయుగంలో ప్రజలు మరింత అప్రమత్తంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ అల్వాల రవి, ఓఎస్‌డీ కొప్పుల అంజిరెడ్డి, హంటు మెట్రిక్స్‌ సంస్థ ఎండీ.అయూబ్‌, రామచందర్‌, ప్రశాంతి, ప్రేమ్‌సాగర్‌, రేఖ, మద్దిలేటి, పాండరయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement