బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు

Mar 27 2026 9:53 AM | Updated on Mar 27 2026 9:53 AM

బంగారం చోరీ కేసులో మహిళ అరెస్టు విద్యుత్‌ వైర్లు తగిలి వృద్ధుడి మృతి

ఆగిరిపల్లి: బంగారం చోరీ కేసులో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శుభశేఖర్‌ కేసు వివరాలను వెల్లడించారు. నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శోభనాద్రమ్మ ఇంట్లో గతేడాది అక్టోబర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి 27 గ్రాముల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన చదల వెంకటేశ్వరమ్మ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మంగళవారం పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ఆమె నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కై కలూరు: చేపల చెరువు గట్టుపై గడ్డి కోయడానికి వెళ్లిన వృద్ధుడు విద్యుత్‌ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన కై కలూరు మండలం గోనెపాడులో గురువారం జరిగింది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి రామకృష్ణంరాజు (72) గోనెపాడులో పెద్దిరాజు చెరువు గట్టుపై గడ్డి కోస్తున్నాడు. గడ్డికోసే కొడవలి విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మరణించాడు. భార్య వరలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement