మద్ది హుండీ ఆదాయం రూ.63,26 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మద్ది హుండీ ఆదాయం రూ.63,26 లక్షలు

Mar 27 2026 9:53 AM | Updated on Mar 27 2026 9:53 AM

మద్ది హుండీ ఆదాయం రూ.63,26 లక్షలు పారిజాతగిరి హుండీ ఆదాయం లెక్కింపు యోగాలో హేమలతకు జాతీయస్థాయి పతకాలు డిజిటల్‌ విధానంలో జనగణన

జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్‌ పర్యవేక్షణ, పోలీస్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీవీ బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా 106 రోజులకు గాను రూ.62,34,432, అన్నదానం హుండీ ద్వారా రూ.92,023 మొత్తం రూ.63,26,455 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి ఆర్‌వీ చందన తెలిపారు.

జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. 80 రోజులకుగాను మొత్తం రూ.11,36,434 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్‌ తెలియజేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ వి.సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల, మండలి చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ముప్పుడి భాను, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆరేపల్లి నాన్ని, అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, దండు ధనరాజు, ఫణి, ఏలూరు విజయవాడ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఇండియన్‌ బ్యాంక్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

అత్తిలి : ఆరవల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్లస్‌లో బోటనీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న చల్లా హేమలత చండీఘర్‌లో నిర్వహించిన ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌ యోగ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు, రజిత పతకాలను సాధించారు. 40 నుంచి 50 సంవత్సరాల కేటగిరీలో ఆర్టిస్టిక్‌ ఫెయిర్‌లో బంగారు పతకాన్ని, రిథమిక్‌ పెయిర్‌లో సిల్వర్‌ పతకాన్ని ఆమె సాధించారు. తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో ఆమె యోగా విజ్ఞానం కోర్సును పూర్తి చేశారు. 2019 నుంచి యోగా పోటీల్లో పాల్గొంటూ జాతీయస్థాయిలో 8 ఈవెంట్లలో పాల్గొని పలు పతకాలను సాధించారు. జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించిన హేమలతను ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు అభినందించారు. తన విజయానికి భర్త రామకృష్ణ ఎంతో సహకరించారని హేమలత తెలిపారు.

ఏలూరు(టూటౌన్‌): దేశ ఆర్థిక ప్రగతికి ప్రజా సంక్షేమానికి జనాభా లెక్కలు దోహదం చేస్తాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ అన్నారు. గురువారం కార్పొరేషన్‌ హాలులో ఇళ్ల జాబితా, జనగణనపై రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనగణన కార్యక్రమంపై ఫీల్డ్‌ ట్రైనర్స్‌ 37 మందికి మొదటి బ్యాచ్‌లో ట్రైనింగ్‌ ఇచ్చామని కమిషనర్‌ తెలిపారు. మే నెలలో ఇళ్ల జాబితా కార్యక్రమం, జనగణన రెండు విడతలుగా నిర్వహిస్తామని చెప్పారు. సర్వే అంతా డిజిటల్‌ విధానంలో ఉంటుందని, ప్రతి కుటుంబానికీ ఉన్న వనరులు సదుపాయాలు విధిగా నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్లు సబ్బితి నరసింహ మూర్తి, జనార్దనరావు, జిల్లా సెన్సస్‌ టెక్నికల్‌ ఇన్‌చార్జి సోనుయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement