మా కుటుంబంలో వెలుగులు
ఆకివీడు మండలం సిద్ధాపు రం గ్రామానికి చెందిన య ర్లపాటి రాణిది పేద కుటుంబం. భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు కాగా కుమారుడు ఇంటర్ చదివి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కుమార్తె పదో తరగతి పూర్తిచేసి ఇంటర్‌లోకి వచ్చింది. అమ్మాయిని ఎలా చదివించాలని ఆలోచిస్తున్న సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాయి. అమ్మఒడి సాయం ద్వారా కుమార్తెను ఇంటర్‌లో చేర్పించారు. తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివించారు. రాణి మనుమలు (కుమారుడు బిడ్డలు) ఇక్కడే ఉంటూ చదువుకుంటున్నారు. వారికీ అమ్మఒడి సాయం అందింది. అలాగే డ్వాక్రా రుణమాఫీలో భాగంగా రాణి కుటుంబానికి ఆసరా పథకం ద్వారా ఏడాదికి రూ.16 వేల చొప్పున రూ.64 వేల సాయం అందింది. చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750 చొప్పున రూ.75 వేలు అందుకున్నారు. రాణి ఉపాధి హామీ పనులకు వెళ్లగా రోజువారీ కూలీ సక్రమంగా అందేది. దీంతో వీరి ఆర్థిక ఇబ్బందులు తొలగాయి. జగనన్న పాలనలో తమ కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించామని, ఆ ఐదేళ్ల పాలనా పండుగలా ఉందని రాణి అంటోంది. – ఆకివీడు
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు గుడాల సురేష్. యలమంచిలి మండలం పెనుమర్రుకు చెందిన ఆయన రెండు ఎకరాలు సొంతంగా, నాలుగెకరాలు కౌలుకు వ్యవసాయం చేస్తున్నారు. 2019కి ముందు కష్టనష్టాలతో వ్యవసాయం మానేద్దామనుకున్నారు. అప్పుడే వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. సాగు సమయంలో రైతు భరోసా పథకం కింద ప్రతి సీజన్‌లో పెట్టుబడులకు డబ్బులు అందా యి. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన వి త్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేవి. ధాన్యం విక్రయించిన రెండు రోజులకే ఖాతాల్లో సొమ్ములు జమయ్యేవి. ప్రకృతి విపత్తుల వేళ ఉచిత పంటల బీమా అండగా నిలిచింది. అలాగే సురేష్ పశువుల పెంపకం ద్వారా వచ్చిన పాలను గ్రామంలోని అమూల్ కేంద్రంలో విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. ఇలా జగన్ ప్రభుత్వంలో అన్నిరకాలుగా మేలు జరిగిందని, సకాలంలో డబ్బులు అందడంతో కుటుంబమంతా ఆనందంగా జీవించేవాళ్లమని, మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రైతులు బతుకులు బాగుపడతాయని సురేష్ అంటున్నారు.
– యలమంచిలి
మా కుటుంబంలో వెలుగులు


