మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

Dec 21 2025 6:58 AM | Updated on Dec 21 2025 6:58 AM

మాజీ

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్యాంసుందర్‌ ప్రజాసేవలో ఆర్టీఐ కీలక పాత్ర పేరుపాలెం బీచ్‌లో తాబేళ్ల పరిరక్షణ చర్యలు బంగారు గొలుసు అప్పగింత

ఏలూరు (టూటౌన్‌): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్‌బాబు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. సూది దారం గుచ్చే ప్రాంతంలోనూ, అగ్గిపుల్లపైనా వైఎస్‌ జగన్‌ చిత్రాలను రూపొందించారు. ఈ విధంగా తన అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలపడం పట్ల మైక్రో ఆర్టిస్ట్‌ సురేష్‌ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గణపవరం: వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన కాకర శ్యాంసుందర్‌ క్రెస్ట్‌సన్‌ నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర వైఎస్సార్‌ టీఏ అధ్యక్షుడు కె.జాలిరెడ్డి నియమాక ఉత్తర్వులు పంపారు. కేశవరం ఆదర్శ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న శ్యాంసుందర్‌ గతంలో వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా శాఖలో పనిచేశారు. శ్యాంసుందర్‌ నియామకం పట్ల జిల్లా వైఎస్సార్‌ టీఏ జిల్లా అధ్యక్షుడు మూరాల సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి బొడ్డు రాంబాబు, గౌరవాధ్యక్షుడు రమేష్‌బాబు అభినందనలు తెలిపారు. తనను నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు జాలిరెడ్డికి శ్యాం సుందర్‌ కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని చెప్పారు.

ఏలూరు(మెట్రో): భూ సర్వేలు, భూ రికార్డులు, ఉప విభజనలు తదితర ప్రజాసేవలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడంలో ఆర్టీఐ చట్టం కీలక పాత్ర పోషించిందని డిస్ట్రిక్ట్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ షేక్‌ మహ్మద్‌ అన్సారీ అన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిస్ట్రిక్ట్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ, ఏలూరు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా ఈ చట్టం ద్వారా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరిగి, ప్రజల నమ్మకం మరింత బలపడిందన్నారు. ఆర్టీఐ దరఖాస్తులను నిర్ధేశిత గడువులోగా పరిష్కరించాల్సిన అవసరం, చట్టంలోని నిబంధనల పట్ల అవగాహన, సెక్షన్‌–4 ప్రకారం ముందస్తు సమాచార ప్రకటన ప్రాధాన్యతపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

నరసాపురం: పేరుపాలెం బీచ్‌లో తాబేళ్ల పరిరక్షణ చర్యలను శనివారం ఆటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్కూల్‌ విద్యార్థులతో కలసి తీరాన్ని శుభ్రం చేశారు. ప్లాస్లిక్‌ వ్యర్థాలు, చెత్తను తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్‌ అధికారి ఎం.కరుణార్‌ మాట్లాడుతూ సముద్రంలో అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో తీరాన్ని శుభ్రంగా, వాటికి అనుకూలంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు వి.ప్రభాకర్‌, సురేష్‌కుమార్‌, మైరెన్‌ పోలీస్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఏలూరు టౌన్‌: పోగొట్టుకున్న బంగారు గొలుసును బాధితురాలికి పోలీసులు అప్పగించారు. పోస్టల్‌ కాలనీకి చెందిన గోవాడ విజయలక్ష్మి తన బంగారు గొలుసును తాకట్టు పెట్టేందుకు ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి వెళుతుండగా.. హాయ్‌ హోటల్‌ సమీపంలో గొలుసు జారిపడిపోయింది. దీనిపై బాధితురాలు ఏలూరు వన్‌టౌన్‌ సీఐ జీ.సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. కోడేలు ప్రాంతానికి చెందిన అడ్డగార్ల లక్ష్మీ ఇందిర తనకు రోడ్డుపై దొరికిన బంగారు గొలుసుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించడంతో వెంటనే డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ ఆ బంగారు గొలుసును బాధితురాలు విజయలక్ష్మికి అందజేశారు.

సూది మొదలులో, అగ్గిపుల్లపై

వైఎస్‌ జగన్‌ చిత్రాలు రూపొందించిన దృశ్యం

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు 1
1/4

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు 2
2/4

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు 3
3/4

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు 4
4/4

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement