సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

Dec 21 2025 12:51 PM | Updated on Dec 21 2025 12:51 PM

సంక్ష

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

వర్ధిల్లు వెయ్యేళ్లు.. పాలనలో జగన్నినాదం

భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు

నా కుమార్తె డాక్టర్‌ చదువుతోంది

మా బడి.. కార్పొరేట్‌ సవ్వడి

అక్కచెల్లెమ్మలకు ‘ఆసరా’గా నిలిచారు.. ఆడబిడ్డల ఉన్నతికి ‘చేయూత’ అందించారు.. పేదల కంటికి ‘వెలుగ’య్యారు.. పిల్లల భవితకు ‘విద్యాకానుక’ తెచ్చారు.. వ్యవసాయానికి ‘భరోసా’నిచ్చారు.. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ను ఇంటి వద్దకే పంపారు.. ఆపద వేళ ‘బీమా’తో ఆదుకున్నారు.. ఇలా అన్నివర్గాలకు ‘నేస్తం’గా పేదల ఇంట ‘నవరత్నాల’ కాంతులు నింపారు. ప్రగతిలో ‘నాడు–నేడు’ వ్యత్యాసం చూపించి అభివృద్ధి ప్రదాత అయ్యారు. కులమత వర్గాలకు అతీతంగా ‘సచివాలయం’ వ్యవస్థతో పాలనను పేదల ముంగిళ్లకు చేర్చారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

సాక్షి, భీమవరం : తండ్రి దివంగత వైఎస్సార్‌ చూపిన బాటలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించారు వైఎస్‌ జగన్‌. 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే నవరత్నాలను అమల్లోకి తెచ్చారు. ప్రతినెలా 1వ తారీ ఖున వేకువజామునే పింఛన్‌ సొమ్మును అవ్వాతాతల చేతికందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి బా టలు వేశారు. టైలర్లు, రజకులు, నాయిబ్రాహ్మణు లు, ఆటో డ్రైవర్లు, మత్య్సకారులు, చేనేత కార్మికులు తదితర అన్ని వర్గాలకు మేలు చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో జిల్లాలోని పేదలకు సుమారు రూ.11,333.57 కోట్లు లబ్ధి చేకూర్చడంతో పాటు రూ.6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.

ఉచిత పంటల బీమా

రైతుల కోసం ఉచిత పంటల బీమాను తెచ్చారు. ఏ సీజన్‌లో పంట నష్టం వాటిల్లితే అదే సీజన్‌లో పరిహారం అందించి ఆదుకున్నారు. జిల్లాలోని రైతులకు రూ. 796.49 కోట్ల రైతు భరోసా సాయం అందించారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచారు.

ప్రజారోగ్యమే పరమావధిగా..

జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం కింద స్పెషలిస్ట్‌ వైద్యులతో విలేజ్‌ క్లినిక్‌లు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్యశిబిరాలు నిర్వహించారు. 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 ర కాల మందులను అందుబాటులో ఉంచి 15 లక్షల మందికి పైగా రోగులకు వైద్యసేవలందించారు. ఆరోగ్యశ్రీలో రూ.5 లక్షల వరకు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు, 1,059గా ఉన్న చికిత్సల సంఖ్యను 3,257కు పెంచారు.

నాడు–నేడు.. అభివృద్ధి చూడు

నాడు–నేడు ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేశారు. పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా డిజిటల్‌ విద్యాబోధన చేపట్టారు. 8వ తరగతి విద్యార్థులకు రూ.30 వేలు విలువ చేసే ట్యాబ్‌లు అందజేశారు. జగనన్న అమ్మఒడి పథకం కింద 1,48,342 మంది తల్లులకు రూ.887.9 కోట్లు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలుగా రూ.770 కోట్లు సాయం అందించారు.

పేదలకు గృహయోగం

పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ జిల్లాలోని సుమారు 76,069 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

తలమానికం ఆక్వా వర్సిటీ.. వైద్య కళాశాల

నరసాపురంలో రూ.332 కోట్ల వ్యయంతో ఆక్వా వర్సిటీ మంజూరు చేశారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో రూ.475 కోట్ల వ్యయంతో 61 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్‌ కళాశాల పనులు చేపట్టి రూ.80 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు.

ఆస్పత్రుల అభివృద్ధి

పాలకొల్లులో రూ.13.50 కోట్ల వ్యయంతో 150 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయగా, నరసాపురంలో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. భీమవరంలో రూ.40 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు.

ప్రగతి ‘బాట’లు

తాడేపల్లిగూడెంలో రూ.36 కోట్లతో కోడేరు–నల్లజర్ల (కేఎన్‌ రోడ్డు)ను నాలుగు లైన్లుగా విస్తరించారు. రూ.వందల కోట్లు వెచ్చించి జిల్లాలోని ఎ న్నో రోడ్లను అభివృద్ధి చేశారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ఏ విధమైన సర్వీస్‌ చార్జీ లేకుండానే 6,05,780 మందికి కుల, ఆదాయ, జనన, మరణ, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ తదితర సర్టిఫికెట్లు అందజేశారు.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా..

రూ.540 కోట్ల వ్యయంతో గ్రామాల్లో సచివాలయలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లు, బల్క్‌మిల్క్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు.

పేదింటి తలుపు తట్టిన సంక్షేమం

జిల్లాలో పేదలకు రూ.11 వేల కోట్లకు పైగా లబ్ధి

రూ.6,988 కోట్లతో అభివృద్ధి పనులు

నేడు మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజు

జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలకు ఏర్పాట్లు

మాజీ సీఎం జగన్‌ పుట్టినరోజు ను పురస్కరించుకుని ఆదివారం జిల్లా అంతటా వేడుకల నిర్వహణకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున ఏ ర్పాట్లు చేశారు. రక్తదాన శిబిరాలు, కేక్‌ కటింగ్‌లు, పేదలకు అన్నదానం, దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం.

– ముదునూరి ప్రసాదరాజు,

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

నా కుమార్తె సాయిసింధూజ డాక్టర్‌ కావాలన్న కల నెరవేరుతోందంటే జగన్‌ చలవే. రెండేళ్ల క్రితం నీట్‌ పరీక్ష రాసిన తర్వాత మచిలీపట్నంలో జగన్‌ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. అప్పుడే రెండేళ్లు పూర్తిచేసుకుని థర్డ్‌ ఇయర్‌ చదువుతోంది. త్వరలో డాక్టర్‌ కోర్సు పూర్తిచేసుకుని పేదలకు సేవ చేయనుండటం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. థాంక్యూ జగన్‌ సర్‌.

– నిమ్మకాయల రామకృష్ణ, కొంతేరు, యలమంచిలి మండలం

ఈ చిత్రంలోని విద్యార్థిని పేరు జాలపర్తి మేఘన. కడియద్ద హైస్కూల్‌లో చదువుతోంది. జగన్‌ ప్రభుత్వంలో ఈ హైస్కూల్‌ను కార్పొరేట్‌ హుంగులతో తీర్చిదిద్దారు. భవనాలను అభివృద్ధి చేశారు. తాగేందుకు సురక్షిత నీరు, అధునాతన బోధనా పద్ధతులు, రుచికరమైన పోషకాహారం, కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా యూనిఫాం, పుస్తకాలు, ఆధునికీకరించిన మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే తల్లులకు ఏటా అమ్మఒడి సాయం అందింది. గతంలో టాయ్‌లెట్‌కు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉండేదని, సమీపంలోని ఆయిల్‌పామ్‌, జామ తోటల్లోకి వెళ్లాల్సి వచ్చేదని, జగన్‌ మామ దయతో తమ పాఠశాలలో అధునాతన మరుగుదొడ్లు ఏర్పాటుకావడంతో ఇప్పుడు ఆ కష్టం తప్పిందని మేఘన అంటోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నానంటే అది జగన్‌ మామ చలవేనని, ఆయన మేలు మరువలేమని చెబుతోంది. –తాడేపల్లిగూడెం

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 1
1/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 2
2/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 3
3/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 4
4/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 5
5/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి 6
6/6

సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement