రోడ్డున పడ్డ పేదలు
ఆకివీడు: స్థానిక అమృతరావు కాలనీ ప్రాంతంలోని శ్మశాన వాటికలో 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను శనివారం నగర పంచాయతీ అధికారులు తొలగించారు. తమకు ఇళ్ల స్థలం ఇవ్వలేదని, తాతముత్తాతల కాలం నుంచీ ఇక్కడే జీవనం సాగిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు నిర్మించుకునేందుకు రూ.4 లక్షలు సహా యం అందజేయాలని బాధితుడు మోండెం స తీష్ ప్రభుత్వానికి కోరారు. దీనిపై తహసీల్దార్ ఫరూక్ మాట్లాడుతూ ఆక్రమణదారుడికి గతంలో ఇంటి స్థలం ఇచ్చామని, ఆ ప్రాంతంలో కా లువ ఉండటంతో ఇబ్బందికరంగా ఉండగా మరోచోట పట్టా ఇచ్చామన్నారు.
భీమవరం: జిల్లాలో శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలకు 91.83 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. ఉదయం 900 మందికి 831 మంది, మధ్యాహ్నం 801 మందికి 731 మంది హాజరయ్యారన్నారు.
ఏలూరులో 652 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో జరుగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారం 652 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 376 మందికి 347 మంది, మధ్యాహ్నం 309 మందికి 276 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ సేవల వినియోగంలో జిల్లా ముందంజలో నిలిచేలా కృషిచేయాలని సీహెచ్ నాగరాణి అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవల ఇంటింటి ప్రచార ప్రగతిపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందితో శనివారం ఆమె గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్షేత్రంలోని అన్ని విభాగాలూ భక్తులతో కిటకిటలాడాయి. హరే శ్రీనివాస భ జన బృంద సభ్యులు (రామానుజపురం) అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
నరసాపురం రూరల్: హస్త కళాకారుల సృజనాత్మకతను, నైపుణ్యాన్ని, ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఎక్స్‌పోలు దోహదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. అన్నారు. శనివారం రుస్తుంబాదలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌టీసీ)లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లికలకు నరసాపురం పుట్టిల్లు వంటిదన్నారు. ఐఎల్‌టీసీ కన్వీనర్ కలవకొలను తులసీరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈపీసీహెచ్ మెంబర్ రవి, రీజనల్ డైరెక్టర్ ఎ.లక్ష్మణరావు, ఆర్డీఓ దాసిరాజు, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్ర యూనియన్ల జేఏసీ పిలుపు మేరకు సోమవారం సహకార సంఘాలు బంద్ పాటించి ఏలూరు డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు రాష్ట్ర జేఏ సీ నాయకుడు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాళింగి వీర వెంకట సత్యనారాయణ, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి సుబ్బారావు ప్రకటనలో తెలి పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 1,200 మంది 255 సంఘాల నుంచి హాజరుకానున్నారన్నారు.
రోడ్డున పడ్డ పేదలు
రోడ్డున పడ్డ పేదలు


