ప్రజల్ని దోచుకునేందుకు ‘మాస్టర్ ప్లాన్’
అన్నింటా దోపిడీ
● తణుకు మాస్టర్ ప్లాన్ కుట్రపూరితం
● మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు అర్బన్ : తణుకులో ఇటీవల ప్రకటించిన మాస్టర్ ప్లాన్ కుట్రపూరితంగా ఉందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించా రు. తణుకు మున్సిపాలిటీతోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఈ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేశారని, ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండడమే కాకుండా దొంగదారిలో రాజకీయ కుట్రతో ప్రజాభిప్రా యం లేకుండానే నిర్ణయించేశారని మండిపడ్డారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేదని అటువంటప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేక రించకుండా మాస్టర్ ప్లాన్‌ను ఎలా తయారుచేస్తా రని నిలదీశారు. ప్రతి వార్డులోనూ ప్రజాభిప్రాయం సేకరించకుండా, ఆయా గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటుచేయకుండా దొడ్డిదారిన మాస్టర్ ప్లాన్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రజావసరాల కోసం చేసే ప్రతి చర్యలోనూ ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేయాలని, ఏదో పేపర్‌లో చిన్న ప్రకటన చేసేసి కార్యాచరణ చేయడం కుట్రపూరితమన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా ఎలా మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్టా అని ప్రశ్నించారు.
ఏకపక్ష ధోరణితో..
మాస్టర్ ప్లాన్ అమలుచేస్తే అది ప్రజలకు ఆమోదయోగ్యం ఉండేలా అభివృద్ధి చేయాలని, ఏకపక్ష నిర్ణయాలతో నిర్ణయాలతో మీ స్వార్థ్యం కోసం మాస్టర్ ప్లాన్ అమలుచేయడం ప్రజావ్యతిరేక చర్య గా పరిగణించాల్సి ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. 2000లో 20 కిలోమీటర్లలోపు మాత్రమే మాస్టర్ ప్లాన్ ఉండగా, 2025లో సుమారు 101.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో చేశారని, దీని వల్లన ఆయా గ్రామాల్లోని ప్రజలతోపా టు రైతులు అన్యాయమైపోతారని అన్నారు. తమ ఆస్తి అమ్ముకోడానికి ఉండదని, పిల్లలకు ఇవ్వడానికి కూడా కాకుండా పోతుందని విమర్శించారు. ఈ ప్లాన్‌తో తణుకు మున్సిపాలిటీ పరిధిలోని టి. వేమవరం, సజ్జాపురం, పైడిపర్రు, వెంకటరాయపురం, వీరభద్రపురం, తణుకు మండలం వేల్పూరు, కొమరవరం, మండపాక, తేతలి, ఇరగవరం మండలం రేలంగి, గోటేరు, కె.ఇల్లింద్రపర్రుతోపాటు తణుకు శివారు గ్రామాలైన వడ్లూరు, పాలంగి, చివటం, ఉండ్రాజవరం, కె.సావరం ప్రాంతాలకు సై తం ఇబ్బందులు తప్పవన్నారు. ముఖ్యంగా రేలంగిలో జనావాసాలు ఉన్న ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ జోన్‌గా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వెంటనే గ్రామాల్లో, వార్డుల్లో ప్రజాభిప్రాయం తీసుకోవాలని, ప్రజల నిర్ణయానికి అనుగుణంగా అవసరమైతే చట్టపరంగా వెళ్లి ప్రజలకు సహకరిస్తానని అన్నారు.
ఇప్పటికే తణుకులో ఆవులు, గేదెలు కోయిస్తున్నా రని పేకాటలు, గంజాయి, మద్యం విక్రయాలు, బెల్టు దుకాణాలు విచ్చలవిడిగా నడిపిస్తున్న కారణంగా ప్రజలు అప్పులపాలైపోతున్నారని కారు మూరి అన్నారు. ముఖ్యంగా పేకాటలకు వచ్చేవారిని నిర్వాహకులు వారి సెల్‌ఫోన్లు తీసుకుని మరీ కార్లు ఎక్కించుకుని తీసుకువెళ్తున్నారన్నారు. గంజాయి పిల్లలకు చేతికందేలా చేశారని విమర్శించారు. అత్తిలిలో పూర్తిగా పేకాట జరుగుతోందని, తాజాగా ప్రజల్ని దోచుకునేందుకు ఇదో మాస్టర్ ప్లాన్ లాంటి మాస్టర్ ప్లాన్ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారామ్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, దువ్వ గ్రామ పార్టీ అధ్యక్షుడు శిరిగిశెట్టి గోపాలకృష్ణ, పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడు యారబాటి రామకృష్ణ, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు షేక్ జిలానీ పాల్గొన్నారు.


