నేటి నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
భీమవరం: జిల్లాలో సోమవారం నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నామని, తొ లిరోజు భీమవరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఈపీడీసీఎల్ ఎస్‌ఈ పులి ఉషారాణి ఆదివారం ప్రకటనలో తెలిపారు. 16న విద్యుత్ పొ దుపు ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు, 17న కళాశాల విద్యార్థులకు ఇంధన సంరక్షణ అవసరం, నూతన సాంకేతికతలపై అవగాహన సదస్సులు, 18న విద్యుత్ పొదుపు ప్రాధాన్యత, బీఈఈ స్వరర్ రేటెడ్ గృహోపకరణాలు వాడకం వల్ల ప్రయోజనాలపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 19న గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఆక్వా రైతు సంఘాల భాగస్వామ్యంతో డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమం, 20న పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు.


