30న ఉత్తర ద్వార దర్శనం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో వైకుంఠ (ముక్కోటి) ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 30 న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి ఆ దివారం తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. రూ.100, రూ.200, రూ.500ల ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ముక్కోటి ముందు రోజు ఈనెల 29న గిరి ప్రదక్షిణను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు మ ధ్యాహ్నం 2.30 గంటలకు స్వామి వారి తొలిమెట్టు (పాదుకా మండపం) వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. గిరి ప్రదక్షిణ అ నంతరం భక్తులకు స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ఈనెల 30 నుంచి వచ్చేనెల 9 వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహిస్తామని, ఆయా రోజుల్లో సా యంత్రం వేళ ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 15న స్వామివారి నిత్యార్జిత కల్యాణా న్ని రద్దు చేస్తున్నట్టు ఈఓ వివరించారు.
భీమవరం: జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీ టెట్ పరీక్షలకు 87.58 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ ప్రకటనలో తెలిపారు. ఉదయం 1,101 మందికి 981 మంది, మధ్యాహ్నం 735 మందికి 627 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో ప్రత్యేక కోర్సులతో ఎంటెక్‌లో ఎనిమిది బ్రాంచీలను తొమ్మిది బ్రాంచీలుగా విభజించారు. 2025–26 విద్యాసంవత్సరానికి 95 సీ ట్లను కేటాయించారు. ప్రస్తుతం బీటెక్‌లో ఎ నిమిది బ్రాంచీలతో పాటు ఎంఎస్ బైరీసెర్చ్ కోర్సులు, పీహెచ్‌డీ ఫుల్‌టైం, పార్ట్‌టైం ప్రాతిపదికన కోర్సులను నిట్ అందిస్తోంది. ఈ వి ద్యాసంవత్సరంలో ఎంటెక్ కోర్సుకు గాను ఇంజనీరింగ్ బ్రాంచీలకు స్పెషలైజ్డ్ కోర్సులుగా రూపకల్పన చేసి కోర్సులను ప్రవేశపెట్టారు. సీట్ మ్యాట్రిక్స్‌లో ఎనిమిది బ్రాంచీలను తొ మ్మిది బ్రాంచీలుగా విభజించి, డిమాండ్ ఉన్న సీఎస్‌ఈ బ్రాంచీలో 15 సీట్లు, మిగిలిన ఎని మిది బ్రాంచీలకు పదేసి వంతున సీట్లు కేటాయించారు.
ప్రత్యేక కోర్సులు ఇలా..
బయోటెక్నాలజీలో బయోప్రాసెసెసింగ్ ఇంజనీర్ కోర్సుగా మార్చారు. కెమికల్ ఇంజనీరింగ్‌ను అలానే ఉంచారు. సివిల్ ఇంజనీరింగ్‌లో జియోటెక్నిక్ ఇంజనీర్ కోర్సును ఉంచారు. సీఎస్‌ఈలో కంప్యూటర్ సైన్స్ డాటా ఎనలిటిక్స్ కో ర్సుగా రూపకల్పన చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పవర్ ఎలక్ట్రానిక్స్ డ్రైవ్స్ ప్రత్యేక కోర్సు ను చేర్చారు. ఈసీఈలో అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రోసెసింగ్‌గా మార్చారు. ధర్మల్ ఇంజనీరింగ్, మాన్యు ఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రత్యేక కోర్సును మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేర్చారు. ఎంఎంఈని మెటీరియల్స్ టెక్నా లజీ ప్రత్యేక కోర్సును ఎంటెక్‌లో చేర్చారు. మెరిట్ ప్రాతిపదికన ఏపీ నిట్‌లో బీటెక్ చదివిన విద్యార్థులు ఎంటెక్‌లో ఇక్కడే సీటు పొందవచ్చు.
నిడమర్రు: కూటమి ప్రభుత్వంలో తాము ఇ బ్బందులు పడుతున్నామంటూ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వద్ద కొల్లేరు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తోకలపల్లిలో జరిగిన సమావేశంలో పలువురు కొల్లేరు రైతులు మంత్రి వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రైతు బలే ఆదినారాయణతోపాటు ప లువురు మాట్లాడుతూ 3వ కాంటూరులో తా తల కాలం నుంచి హక్కుగా వస్తున్న భూము ల్లో సంప్రదాయబద్ధంగా వ్యవసాయం చేసు కుంటున్నామని, ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు లేవన్నారు. అయితే ఇ టీవల అటవీ శాఖ అధికారులు సంప్రదాయ వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైతుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ వీరాంజనేయులు ఉన్నారు.


