పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని ఇంటి వద్ద కత్తితో ఆకస్మికంగా దాడి చేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూరల్ పరిధిలో గణేష్ నగర్‌లో ఉంటున్న నమ్మిన హరికృష్ణ (32) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దీపక్ ఆర్‌ఆర్‌పేటలోని హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మద్య గతంలో సన్నిహిత సంబంధాలు ఉండగా... ఇటీవల మనస్పర్థలు పెరిగాయని చెబుతున్నారు. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 6.30గంటల సమయంలో గణేష్‌నగర్‌లోని హరికృష్ణ ఇంటివద్దనే దీపక్ కత్తితో దాడి చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఏలూరు రూరల్ ఎస్‌ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


