మెడికల్ కాలేజీలపై కూటమి కుట్రలను అడ్డుకుందాం
● 12న ప్రజా ఉద్యమం నిరసన కార్యక్రమాలు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుముదునూరి ప్రసాదరాజు
నరసాపురం: వైద్య విద్యను పేద, మధ్యతరగతి వర్గాలకు దూరం చేసేలా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. ఈనెల 12న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమ పోస్టర్లను శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదునూరి మా ట్లాడుతూ మెడికల్ కళాశాలల నిర్వహణ విషయంలో కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే, వాటిని నిర్వహించే సత్తాలేని కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుందన్నారు. పేద, మధ్యతరగతి వారికి ఉన్నత విద్యను అందించాలని దివంగత సీఎం వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలుచేశారని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా అదే పంథాలో పాలన సాగించారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం చేపట్టిందన్నారు. సేకరించిన సంతకాల ప్రతులను ఈనెల 12న జిల్లా కలెక్టర్, ఆర్డీఓల అందిస్తామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ, ఎంపీపీ మైలాబత్తుల సోనీ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సీనియర్‌నేత పప్పుల రామారా వు, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కామన బుజ్జి, ఉంగరాల రమేష్, బీసీ సెల్ రాష్ట్ర నేతలు దొంగ మురళి, తిరుమాని నాగరాజు, బర్రి శంకరం, కావలి నాని, కొల్లాబత్తుల రవికుమార్, సయ్యపరాజు వర్మ, కడలి రాంబాబు తదితరులు ఉన్నారు.


