జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

Nov 8 2025 8:02 AM | Updated on Nov 8 2025 8:02 AM

జగనన్

జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు సుప్రీంకోర్టు సీజేపై దాడి దారుణం బాల్య వివాహాలను నియంత్రించాలి

చాట్రాయి: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ స్తంభాలను కాంట్రాక్టర్‌ తొలగించిన సంఘటన మండలంలోని కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామంలోని 3వ లేఅవుట్‌లో గత ప్రభుత్వంలో 30 మంది లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి, రోడ్డు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేశారు. అయితే అనివార్య కారణాల వలన లబ్ధిదారు లు ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ నేపథ్యంలో వి ద్యుత్‌ స్తంభాలు వేసిన కాంట్రాక్టర్‌ గురువారం లేఅవుట్‌లోని నాలుగు స్తంభాలను తొలగించి మరోచోటుకు తరలించారు. విషయం తెలిసిన సర్పంచ్‌ చల్లగుళ్ల వెంకటేశ్వరరావు వెళ్లి నిలదీయగా బిల్లులు రాకపోవడంతో స్తంభాలు తొలగిస్తున్నట్టు కాంట్రాక్టర్‌ చెప్పాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ స్తంభాలు తొలగించడం దారుణమని లబ్ధిదా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రా లేకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్‌ స్తంభాల ను తొలగించాడని, తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.

ఏలూరు (టూటౌన్‌): సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి చేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ కలెక్టరేట్‌ వద్ద దళిత సేన ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్‌ మాట్లాడుతూ గవాయ్‌పై దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని, దాడి జరిగి రోజులు గడుస్తున్నా సుమోటోగా కేసును సుప్రీంకోర్టు గాని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ గాని ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా సుమోటో కేసు నమోదు చేయాలని డి మాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో ఇచ్చారు. దళిత సేన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చీలి మోహనరావు, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దిరుసు పాము కృష్ణమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డి.పుష్ప, కృష్ణా జిల్లా దళిత సేన అధ్యక్షుడు భూసే అనిల్‌ కుమార్‌, నాయకులు పాల్గొన్నారు.

నూజివీడు: డివిజన్‌లో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సబ్‌ కలెక్టర్‌ బొల్లిపల్లి వినూత్న అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నియంత్రణపై డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మా ట్లాడుతూ డివిజన్‌లోని ఆరు మండలాల్లో క లిపి 23 బాల్య వివాహాలు జరిగినట్టు రిపోర్టు అయ్యాయని, వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం మాత్రం టీనేజీ గర్భిణులు 302 మంది నమోదయ్యారన్నారు. ఇది అందరి వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు. ఎంఎస్‌కేలు గ్రామస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఐసీడీఎస్‌ పీడీ పి.శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి, సీడీపీఓ పి.విజయకుమారి, డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు 
1
1/1

జగనన్న కాలనీలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement